Wednesday, December 3, 2014

లా ఇలాహ ఇల్లల్లాహ్‌


ప్రవక్త నూహ్‌ (అ) వారికి మరణ ఘడియలు సమీపించినప్పుడు తన కుమారుణ్ణి పిలిచి ఇలా హితవు పలికారు: ”కుమారా! నేను నీకు రెండు విషయాల గురించి తాకీదు చేస్తున్నాను. రెండు విషయాల నుండి నిన్ను వారిస్తున్నాను. ఆయన చెప్పిన వాటిలో-”సప్తాకాశాలు, సప్త భూములు త్రాసు ఒక పళ్ళెంలో పెట్టి, ‘లా ఇలాహ ఇల్ల ల్లాహ్‌’ మరో పళ్ళెంలో పెట్టినట్లయితే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ ఉన్న పళ్ళమే వంగుతుంది’. సప్తాకాశాలు, సప్త భూములు ఒక ముద్దలా పదార్థంలా ఏర్పడితే వాటిన్నంటినీ లా ఇలాహ ఇల్లహ్‌ ఇల్లల్లాహ్‌ వేరు పరుస్తుంది. (అహ్మద్‌) ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది:
”భూమ్యాకాశాలు కలిసి ఉండగా, మేము వాటి ని విడదీసిన వైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా ప్రాణమున్న ప్రతీదానిని మేము నీటితో సృష్టించాము”. (అన్బియా:30)
సృష్టి మొత్తం కలిసి కూడా ఈ వచనానికి సరి తూగజాలదు అంటే ఈ వచనం ఎంతటి మహి మాన్వితమయినదో అర్థం చేెసుకోగలరు. ఈ కారణంగానే విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స) తన జాతి వారిని, తద్వారా సమస్త మాన వాళిని తొలుత పిలుపునిచ్చింది ఈ శిష్ఠ వచనం వైపునకే. ఓ ప్రజలారా! మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్‌ చెప్పండి. తద్వారా అరబ్బు, అరబ్బేతర ప్రాంతాలు మీ పాదాక్రాంతమవుతాయి’ అని చెప్పారు.
ప్రియ పాఠకుల్లారా! ఒక వ్యక్తి ఈ వచనాన్ని చదివే ఇస్లాం పరిధిలోకి ప్రవేశిస్తాడు. మనం కూడా ఈ శిష్ఠ వచనం ఆధారంగానే ముస్లింలు గా పరగణించబడుతున్నాము. ఈ వచనం మరి పెద్దదేమీ కాదు. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’. అయితే ఈ వచనాన్ని ఓ వ్యక్తి మనసా, వాఛా, కర్మణా-త్రికరణ శుద్ధితో ఉచ్చరించిన మరుక్ష ణమే అతని జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి.

No comments:

Post a Comment